మెదక్ జిల్లా మాసాయిపేట మండల తాసిల్దార్ జ్ఞాన జ్యోతి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవపత్రం అందుకున్నారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు, అంతేకాక వీధి వీధి తిరిగి స్థానిక సమస్యలు తెసులుకోని వారికి అండగా నిలిచారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న జ్ఞాన జ్యోతి తన సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు. సిబ్బంది , మండల నాయకులు, స్థానికులు తహసీల్దార్ కి అభినందనలు తెలిపారు.