మెదక్ జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ నగేష్ పంపాటి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపవర్ నిర్మాణ్ వారోత్సవాల్లో భాగంగా యువత సాధికారత కార్యక్రమాన్ని 20వ ఆగస్టు 2024 నుండి 24 ఆగస్టు 2024 వరకు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సదస్సును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గణేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యోగ తప్పకుండా చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నిత్య యోగ సాధన వల్ల బిపి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్,త ల నొప్పి,శరీర నొప్పులతో పాటు దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని, యోగాసనాతో పాటు రోజు వీలునుబట్టి ప్రాణాయామం, ముద్రలు, షట్ క్రీయలు, ధ్యానం చేయాలని, ధ్యానం వలన ఏకాగ్రతతో విద్యార్థులు చదువుపై మంచి పట్టు సాధించి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారని తెలిపారు.
రామ్ ఫనిదర్ మాట్లాడుతూ మూడు నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు మొబైల్ ఫోన్ కు బానిసలు అయ్యారని, ఈ అలవాటును తొందరగా మార్చుకోకపోతే శరీరం లోని కళ్ళు, మెదడు తో పాటు మెడకు సంబంధించిన మరియు వెన్నుమూకకు సంబందించిన నరాలు దెబ్బతింటాయని, ఈ అలవాటును సాధ్యమైనత తొందరగా మానుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేగుంట లయన్స్ ప్రెసిడెంట్ బుర్క నాగరాజు, సెక్రటరీ రజనకు రామచంద్రం, ట్రెజరర్ న్యాలపల్లి సతీష్, డీసి లింగమూర్తి, ఫాస్ట్ ప్రెసిడెంట్ ఒంటరి రామ్ రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వరుగంటి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ కంతి రమేష్, సభ్యులు సూర్యప్రకాశ్, నాగేశ్వరయ్య, స్కూల్ ప్రిన్సిపాల్ వివేక్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.