మెదక్ జిల్లా – చేగుంట : తెలంగాణ మోడల్ పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి 240 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ల్గొన్న జిల్లా విద్యాధికారి కి వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు వందన సమర్పణ నిర్వహించారు ఈ క్రీడలలో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుండి 240 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది, క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి ఆర్థిక సహాయంతో బహుమతులతో పాటు క్రీడాకారులకు పిఈటిలకు భోజన వసతి కల్పించారు, క్రీడోత్సవాలకు హాజరైన అతిథులకు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు పరంజ్యోతి శాలువా మెమెంటోలతో సన్మానించారు.
అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, మండల విద్యాధికారి నీరజ మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, లు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరగడంతో పాటు వారు తెలిపారు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను జాతీయస్థాయి పంపించడం జరుగుతుందని క్రీడల్లో గెలుపు ఓటమి సహజం కాబట్టి ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా రేపటి గెలుపుకు ముందుకు పోవాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, ఎస్ జి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ, కర్ణం గణేష్ రవికుమార్, వివిధ జిల్లాల క్రీడోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు