చెగుంట : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా, ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి, వారి దార్శనికతను, నాయకత్వం, సామాజిక సేవలను కొనియాడి ఘనంగా నివాళులు సమర్పించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందిరా గాంధీ గారు పేద ప్రజల కోసం చేసిన కార్యాలు ఎప్పటికీ నిలిచిపోయే మార్గదర్శకంగా ఉంటాయి. పేదలకు ఇల్లు, భోజనం అందించడం, వ్యవసాయ భూములను పంచడం వంటి చర్యలు దేశ చరిత్రలో మరచిపోలేని ఘనతలు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు M శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, మహేష్, మొజామిల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్, కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్, పిసెర్మన్ సోమ వెంకటేష్, జిల్లా నాయకురాలు కురుమ లక్ష్మి, మాజీ దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంకన్న, సాయి కుమార్ గౌడ్, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మహుమద్ నదీమ్ అలీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.