మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లో ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తగ్గా బస్సుయాత్ర 18.న మహబూబ్ నగర్ లో జిల్లాలో ప్రారంభమై 23 తేది చెన్నూరుకు చేరుకున్న సందర్భంగా వివిధ ప్రజాసంఘాలు సామాజిక శక్తులు గనస్వాగతం పలికారు .వివిధ కళారూపాలతో స్వాగతం పలుకుతూ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.యాత్ర బృందం రథసారథి, యాత్ర కన్వీనర్ ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమిని కొంతమంది బడాబాబులు రియల్ ఎస్టేట్ మాఫియా, అసైన్మెంట్ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అసైన్మెంట్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు మున్సిపల్ అధికారులు కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరింపులు కొనసాగిస్తున్నారు. అని పేదలకు ఎవరు అండ లేదనుకున్నారా.. అని వల్ల అండగా మేమున్నామంటూ ఎర్రజెండా ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచమంత ఎర్రజెండా ఉంది కష్ట జీవుల్లో ఉంది పేదలలో బెదిరిస్తేనో, పేదలపై కేసులు పెడితే, ఈ పోరాటం ఆగదు అని పేదరాలను బెదిరించి కేసులు పెడితే పోరాటం ఆగుతుందని అనుకోవడం పొరపాటు. అని ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తాను మూడు లక్షల రూపాయలు ఇస్తాను అంటే పరిష్కారం కాదు. ఇప్పటికీ సొంత ఫ్లాటు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెటట్ ఉంటేనే ఇస్తదట గవర్నమెంట్ ఇల్లు కడితే ఎనిమిది లక్షల అవుతాయి మరి మూడు లక్షలు ఏమి సరిపోతాయి. సొంత ఫ్లాట్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు, ఇవ్వడం ఏంది అని మండి పడ్డారు.. అసైన్మెంట్ భూములను కబ్జా గోర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసైన్మెంట్ భూములను అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వత్తాసు పలుకుతూ .పేదలపై అక్రమ కేసులు పెట్టడంలో ఆంతర్యం ఏంటని. అన్నారు.యాత్ర బృందం కమిటీ సభ్యులు మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఫైల్ ఆశయ, కెపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుగంటి వెంకటేష్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీన ర్జగదీష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, ముత్యాలు ప్రజానాట్యమని రాసిన నాయకులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సంఖ్య రవి, వృత్తిదాల సంఘం జిల్లా కన్వీనర్ బోడె oకి చందు, అవాజ్ జిల్లా కన్వీనర్ ఎండి అవేజ్, సిఐటియు జిల్లా నాయకురాలుదాసరి రాజేశ్వరి, మరియు తదితరులు పాల్గొన్నారు.