- ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం
- మిషన్ భగీరథ నీళ్లు అందించాలని ఆదేశం
మంచిర్యాల జిల్లా,చెన్నూరు : మండలంలోని సోమనపల్లి గ్రామపంచాయతీ లో గల లక్ష్మీపూర్ గిరిజన గ్రామంలో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక మొట్టమొదటిసారిగా మారుమూల అటవీ ప్రాంతంలో గల గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ బ్యాగులు అందించి ఒక్కొక్క విద్యార్థిని పరామర్శిస్తూ మీ ఆశయం ఏంటని పిల్లలను అడిగి ఆశయ సాధనలో భాగంగా ప్రతిరోజు పాఠశాలకు రావాలని ఇంటి వద్ద ఎవరు ఉండకుండా అందరూ కలిసి రావాలని పిల్లలను కోరారు. అంతేకాకుండా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మడవి గంగారం పిలిచి పాఠశాలకు సంబంధించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు చేకూర్చే లాగా చర్యలు తీసుకోవాలని ప్రతినెల పాఠశాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామ ప్రజల సమస్యలు విన్నవించడంతో మంచినీరు మిషన్ భగీరథ ద్వారా రావడం లేదని ఎవరు పట్టించుకోవడంలేదని తెలుపడంతో భగీరథ ఏఈ వై అధికారులను పిలిచి 15 రోజుల్లో గిరిజన గ్రామానికి నీళ్లు అందించేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు ఏవైనా గ్రామసభల్లో వినతి పత్రాలు ఇవ్వాలని అవి తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచికి తెలిపారు. సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు చాలా సంవత్సరాలుగా మూతబడిన పాఠశాలను గిరిజన ప్రజల ఆశయాల మేరకు పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి శారద, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ తిరుమల పిఎసిఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి గిరిజన నాయకులు మనుబోతుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు హేమంత్ రెడ్డి ,రఘునందన్ రెడ్డి, వార్డు సభ్యుల సునంద ఆయా శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.