- మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు
మంచిర్యాల జిల్లా/ చెన్నూరు : నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ సోమవారం పై సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఆగంతక దుండగులు ప్రెస్ క్లబ్ లో ప్రవేశించి అతనిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ, మరియు ఈ సంఘటన జరిగి మూడు రోజుల జరుగుతున్న ఇప్పటి వరకు పోలీసులు ఆగంతక దుండగులను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేశారు స్థానిక పట్టణంలో ని బస్స్టాండ్ నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ ర్యాలీలో జర్నలిస్ట్ లకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ,బి.ఆర్.ఎస్ పార్టీ సి.పి.ఎం దాని అనుబంధ సంఘాల గిరిజన సంఘాల కార్మిక, కర్షక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.జర్నలిస్ట్ వెంకట్రాజ్ కి న్యాయం జరిగే వరకు మీరు చేసే పోరాటం లో మేము మీకు తోడుంటామని అన్నారు. అనంతరం అనంతరం ఏ.డి.జె.ఎఫ్ జాతీయ అధ్యక్షులు తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ దాడి జరిగి రెండు రోజులు గడిచినప్పటికి దుండగులను గుర్తించకపోవటం చాలా దారుణం అన్నారు.న్యాయం జరుగని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వెంకట్రాజ్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గా నియోజకవర్గ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలను చేస్తామన్నారు.