మంచిర్యాల జిల్లా, చెన్నూరు: పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో తాగిన మైకంలో కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం రోజున ఎమ్మెల్యే కాలనీకి చెందిన నెన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకలో రాత్రి సుమారు 11గంటల ప్రాంతంలో అదే కాలనీ కి చెందిన ఆకుల సంజీవ్, పందుల సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో పందెంకోడి కత్తులతో విచక్షణారహితంగా జరిపిన దాడిలో పెళ్ళికొడుకు కిరణ్ తో పాటు మరో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. నెన్నల కిరణ్, చింతకింది చరణ్ ఇరువురి పరిస్థితి విషమించగా కుటుంబసభ్యులు హుటాహుటిన మేలైనా వైద్య నిమిత్తం కరీంనగర్ తరలించారు. సంఘటనా స్థలానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సందర్శించి, దాడికి పాల్పడిన సంజీవ్ తన మేన కోడలు పాతర్ల కార్తీక్ అనే యువకుడితో చనువుగా మాట్లుడుతున్న క్రమంలో కోపోద్రీక్తుడు అయిన సంజీవ్ సమ్మయ్య అనే మరో వ్యక్తితో కలిసి పెళ్లి వేడుకల్లో కోడిపుంజుకు కట్టే కత్తులతో దాడికి పాల్పడగా, పెళ్లి కొడుకుతో సహా పలువురికి తీవ్ర గాయలయ్యాయని, దాడికి పాల్పడిన ఇరువురిని అదుపులోకి తీసుకొని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.