మంచిర్యాల జిల్లా చెన్నూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధనకై కృషి చేస్తూ ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణంలోని రాజన్న కాలనీలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా అన్నారు. నేడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులే రాజ్యాంగం పైన విల్లు ఎక్కు పెట్టారని, పాలకులు మాటల్లో అంబేద్కర్ ను పొగుడుతూనే ఆయన ఆశయాలను నిలవున పాతేస్తున్న పాలకుల దుష్ట పన్నగాలను పసిగట్టకపోతే రేపు పబ్లిక్ గానే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం అనేది జగమెరిగిన సత్యం అని, అనగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేసినప్పటికీ, ముఖ్యంగా కుల నిర్మూలన, అస్పృశ్యత నివారణ, ఆర్థిక సమానత్వం, మానవ హక్కులు, బలహీన వర్గాల సాధికారతపై ప్రత్యేక కృషి చేసారని అన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసి సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్లు లేకుండా చేసేస్తున్నారని, ప్రజాస్వామ్యం పైన దాడి ప్రారంభించారని, అంబేద్కర్ జయంతి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలను ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీల నుండి రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని దానికి గానూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించడమే ప్రథమ కర్తవ్యం అని చందు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సిడం సమ్మక్క, బోండ్ల సరిత, రామగాని సమ్మక్క, రమాదేవి, కుమార్, బుధక్క, ఎల్లక్క, శ్యామల, పద్మ, శంకరక్క, మదనక్క, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.