కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులు (36) క్రికెట్ ఆడేందుకు తోటి స్నేహితులతో కలిసి హుస్నాబాద్ కు వెళ్లాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు వివాహమైంది. ఆయనకు భార్య, తల్లి ఉన్నారు.