- మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో గణపవరం గ్రామంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిర నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలనికోరారు. జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఇటువంటి రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేయాలని జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త రాజా రమేష్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.