- వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందిచాలని ప్రజాసంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక నేతలు డిమాండ్.
అల్లూరి జిల్లా హుకుంపేట : మండలంలోని పలు పంచాయతీలో రోజు తప్పించి రోజు జరుగుతున్నే ఉంది ఉప్పు సబ్ సెంటర్ పరిధిలో శిశు మరణాలు అదికంగా నమోదు కావడం గమనార్హం.వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందిచాలని ప్రజా సంఘంలు బాలల హక్కుల సంఘంల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆగని శిశువు మరణాలు వారం వ్యావధిలోనే 4గు శిశులు మృతి చెందారు. మండలంలోని బి.బొడ్డ పుట్టు పంచాయతీ బొర్రా మామిడి గ్రామంలో పాడి బాలక్రిష్ణ , లావణ్య దంపతులు రెండో సంతనం 4నెలలు బాబు అనారోగ్యంతో హఠాత్తుగా గురువారం రాత్రి మరణీంచారని తల్లి తండ్రులు పేర్కొన్నారు.చక్కగా తోటి పిల్లలుతో ఉంటూ హఠాత్తుగా మృతి చెందాడంతో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మత్య్స పురం పంచాయతీ ఉట్ట గెడ్డ గ్రామంలో 6వతేదీ ఆదివారం రాత్రి సుబ్బారావు, సుందరమ్మ దంపతుల రెండు నెలలబాబు హఠాత్తుగా మృతి చెందారు. అదే రోజు మెరక చింత పంచాయతీ కరకపూట్టు గ్రామంలో వలసనైని.సత్తిబాబు దయవతి ,దంపతుల ఐదు నెల బాబు మృతి చెందారు.రెండు రోజుల గడవకముందే పట్టాం పంచాయతీ బూరువలస గ్రామంలో వంతల.రత్నలు రాజు దంపతులకు పుట్టిన రెండు నెలల ఏకైక ఏకైక కుమారుడు 09న బుధవారం జలుబు దగుతో హఠాత్తుగా మృతి చెందారు. అదే రోజు సాయంత్రం నుంచి తల్లి
వంతల.రత్నలు అవస్థలు గురై అరుకు ఏరియా ఆసుపత్రికి వైద్య సేవలు పోందుతున్నరని వారు తెలిపారు.మరణాలు వారుస జరగడం చాలా చాలా బాధాకరం విషయ లు మరణాలు జరిగే నేటివరకు ఎరకంగా మారణాలు సంబవించిది ఎందుకు జరిగింది అని విషయం తెలుసుకుని నిర్ధారణ చేసి వైద్య సేవలు అందించక పోవడం విచారకరమని మృతి చెందిన కుటుంబ సభ్యులకు రోదిస్తూన్నారు. ప్రభుత్వలు శిశువు మరణాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రకటన వరకే పరిమితం తప్పు మారుమూల ప్రాంతాల్లో శిశువు మరణాలు మాత్రం అదుపు చేసేందుకు ప్రభుత్వం విఫలమైందని మృతి చెందిన తల్లి తండ్రులు ఆరోపించారు.జిల్లా ఏర్పాటు చేసి వైద్య రంగంలో వైద్య సేవలను ముఖ్యంగా మతశిశు మరణాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున జిల్లా కలెక్టర్ పేర్కొంటన మారణాలను ఏదో ఒక చోటున పసికందులకు మరణాలు వేంటడుతునే ఉంది. శిశువు మరణాల పై కుటుంబ సభ్యులకు అవగాహనా లోపం లేక వారి శాపమా అర్థం కావడం లేదని తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉప్పు సబ్ సెంటర్లలో వారం రోజుల్లో నాలుగురు మరణిచడం గమనార్హం.మారుమూల ప్రాంతాల్లో పర్యటించి బాలింతలకు,గర్భిణులు, పిల్లలు కు వైద్య సేవలు ఎలా అందుబాటులో ఉన్నయిఓ ఇ శిశు మరణాలు బట్టి అర్థం చేసుకోవచ్చు మరణాలకు అదుపు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎరకమైన చర్యలు తీసుకొంటున్నారో వేచిచూడాలి. పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయలని గిరిజన సంఘం, బాలల హక్కుల పరిరక్షణ వేదిక టి.కృష్ణా రావు,కొర్రా ఆనంద్ లు డిమాండ్ చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో అర కొర వైద్య సేవలు వల్లే వరస మారణాలు సంభవిస్తుందిని వారు స్పష్టంచేశారు. ఇప్పటి కైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోరవ తీసుకుని పూర్తి శిశు మారణాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.