- దసరా సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలకు సిఫారసు:
- రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బాతుల పద్మావతి
ఒంగోలు, నరసారావు పేట పట్టణంలో మరియు పల్నాడు జిల్లాలో:దసరా సెలవుల్లో రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెరవడానికి వీలులేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బాతుల పద్మావతి అన్నారు. సోమ వారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పద్మావతి మాట్లాడుతూ పిల్లలకు వర్క్ షాపులు,సిలబస్ పూర్తి కాలేదని నెపాలుతో,పదో తరగతి ప్రత్యేక తరగతులు వంటివి నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికొస్తే అటువంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్నామని చెప్పారు,ఎవరికి ప్రత్యేక మినహాయింపులు లేవన్నారు,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదులను మండల,జిల్లా విద్యా శాఖాధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు, 1098 చైల్డ్ లైన్ కు,1092 కాల్ సెంటర్ తో పాటు secy.se.edn@gmail.com అలాగే apscpcr2018@gmail.com లకు ఫిర్యాదులు అందించాలని పద్మావతి సూచించారు.