పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లెనిన్ నగర్ అంగన్వాడీ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను టీచర్ బి. శ్రీదేవి నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థులు వివిధ వేషధారణలు ఏక పాత్రాభినయాలు గేయాలు సంగీత నృత్య ప్రదర్శనలు జానపద కళారూపాలు వంటివి ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో జెసి డీఎస్ అధికారులు జ్యోత్స, ప్రసన్న, హెచ్ ఎమ్ కొండలు, మహిళా పొలుసులు జైనా, లక్ష్మి , అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, సరళ, వెంకాయమ్మ,జ్యోతి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.