ప్రకాశం జిల్లా / చీమకుర్తి : చీమకుర్తి ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో శనివారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వంటగదిని , మరుగుదొడ్లను, వంట సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులను ఆహారం గురించి, వసతుల గురించి, వార్డెన్ వచ్చే సమయాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో విధుల్లో లేని హాస్టల్ సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.