ప్రకాశం జిల్లా / చీమకుర్తి : జిల్లాలోని మోటు మాల బాలికల వసతి గృహంలో ప్రసవించిన మైనర్ బాలిక కేసు ను పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలిక తెలిపిన వివరాల ప్రకారం కేసు దర్యాప్తు చేయగా నిందితులలో ఒకరు చీమకుర్తికి చెందిన సైదా బాబు ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు. అతని స్నేహితులైన శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డిలు కూడా బాలికను బ్లాక్ మెయిల్ చేసి భయభ్రాంతులకు గురిచేసి గత కొద్ది నెలలుగా అత్యాచారం చేయసాగారు. పాఠశాలలు మొదలవడంతో వసతి గృహానికి వెళ్ళిన బాలిక బాత్రూంలో డెలివరీ అవ్వడంతో గ్రహించిన సిబ్బంది వారి తల్లిదండ్రులకు తెలియచేశారు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి,విచారించి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ స్త్రీలపై జరిగే అత్యాచారాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, బాలికల సంరక్షణకు తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
Prakasam Dist: బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని… !