contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Chimakurthi: యాంటీ డ్రగ్స్‌, యాంటీ ర్యాగింగ్‌ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ప్రకాశం జిల్లా / చీమకుర్తి : బి వి ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమము నిర్వహించారు. సీఐ ఎం.సుబ్బారావు ముఖ్య అతిధి గ పాల్గొని విద్యార్థులకు యాంటీ డ్రగ్స్‌, యాంటీ ర్యాగింగ్‌ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎలాంటి పదార్థాలు డ్రగ్స్‌ కిందకి వస్తాయి వాటికి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారు అనే అంశాల గురించి విపులంగా వివరించారు. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్‌ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్‌ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు.

విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్‌ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. విద్యార్థులు ర్యాగింగ్‌ కు పాల్పడితే చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. విద్యార్థులందరూ తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని, సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని తెలిపారు. అదేవిధంగా లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయరాదని డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు పాటించవలసిన రహదారి నియమ నిబంధనలను విద్యార్థులకు వివరణాత్మకంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు , పోలీసు సిబ్బంది . కళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :