వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశీలించి అనంతరం తీసుకోవలసిన నియమ నిబంధనలు, జాగ్రత్తలు గురించి వివరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ చిలకలూరిపేటలోని నిమజ్జనం చేసేటువంటి పసుమర్రు వాగు, ఒంగోలు బ్రిడ్జి, గణపవరం బ్రిడ్జి తదితర ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాకుండా వినాయకుని విగ్రహాలను నిమజ్జనం నిమిత్తం ఊరేగించి తీసుకువెళ్లేటువంటి ప్రధాన రహదారులు అయినా ఎన్నార్టీ సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డరోడ్డు సెంటర్ లను కూడా ఆయన పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా పలనాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలు నియమనిబంధనలు పాటిస్తూ పండుగను నిర్వహించుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు, ప్రజలకు ఆయన సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ సురేష్ బాబు, చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్, పట్టణ ఎస్ఐ లు చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.