విజయనగరం జిల్లా : ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్‌మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుద్దీపాల అలంకరణలతో కనపడుతున్నాయి. బాడింగి మండలం డొంకిన వలస గ్రామంలో పాస్టర్ ప్రేమనందం, స్టీవన్ సన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగియాయి. సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలో క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
