- తహసిల్దార్ నా వెనుక మనిషే
- అందరూ నా మాట వినాల్సిందే
- లేకుంటే వారి భరతం పడతా
- ఇదే తరహాలో పేదల ఇంటి స్థలాలపై కన్నెర్ర
- అతనిపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్న
- రెవెన్యూ ఉన్నత అధికారులు
- జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు తలారి సునీత, తలారి మావి కుమారుడు బాధితుడు ప్రసాద్ బాబు విజ్ఞప్తి
చిత్తూర్ జిల్లా , ములకలచెరువు :నా పేరు అంజి… నేను ఎవరికి భయపడను…! నేను ములకల చెరువు మండలంలో ఆర్ ఐ గా పని చేస్తున్నాను. మండలంలో నేనంటే అందరికీ హడల్. నా మాట అందరూ వినాల్సిందే. లేకుంటే వారి భరతం పడతా. మండల తహసిల్దార్ కూడా నా వెనుక మనిషే. నేను చెప్పిందే అందరూ వినాలి. అదే తరహాలో మండలంలోని ప్రజలు బాధితులపై ఆయన కన్నెర్ర చేస్తున్నాడు. చివరికి పేదల ఇంటి పట్టాలపై పడి పేదల ఇంటి కలలను కూడా సాకారం కాకుండా వారిని నిత్యం భయబ్రాంతులకు గురి చేస్తూ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. కనీసం మహిళ, వయోవృద్ధులు అని కూడా చూడకుండా వారిపై బూతుల పురాణంతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడనుటలో ఎటువంటి సందేహం లేదు. అతనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అతనిపై చర్యలు తీసుకోవాలంటే రెవెన్యూ ఉన్నతాధికారులు సాహసించాల్సిందే. చివరికి జిల్లా కలెక్టర్ అయిన స్పందించి అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులు స్థానిక ప్రజల తెలిపిన సమాచారం మేరకు
వివరాల్లోకి వెళితే…
మదనపల్లి ములకల చెరువు మండలం ములకల చెరువు గ్రామపంచాయతీ గ్రామ లెక్క దాఖలా సర్వే నంబర్ 418 లో నిరుపేదలైన తలారి సునీత, తలారి మావి కుమారుడు ప్రసాద్ బాబులకు 2014లో ఒకటిన్నర సెంట్లు చొప్పున ఇద్దరికీ కలిపి మూడు సెంట్లు స్థలాన్ని అప్పటి ప్రభుత్వం అప్పటి తహసిల్దార్ 108 ప్రభుత్వ కార్యాలయం ప్రక్కనే మంజూరు చేశారు. మొదటగా తలారి సునీత తనకు ఇచ్చిన ఒకటిన్నర సెంటు భూమిలో ఇల్లు కట్టుకొని తన సొంతింటి కల నెరవేర్చుకునేందుకు శ్రీకారం చుట్టింది. మావి చనిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత అతని కుమారుడు ప్రసాద్ బాబు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో నాటి నేటి వైసిపి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అతని అనుచరులు, చివరికి వైసిపి నేతలు కార్యకర్తలు కు ఆ ఇద్దరి మూడు సెంట్లు స్థలంపై కన్ను పడింది. మొదటిగా తలారి సునీత ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అది వీలు కాలేదు. వెంటనే స్వర్గీయ మావి ఇంటి స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు .కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అంతే ఇద్దరిపై రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ తరిమికొట్టి వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు, పట్టాలను రద్దు చేయాలని రెవెన్యూ అధికారులకు పలుమార్లు కబ్జారాయుళ్లు వెళ్లి ఫిర్యాదులు చేశారు. చివరికి పోలీసులు తలారి సునీతపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాధితురాలు తలారి మావి ఇంటి స్థలంలో విద్యుత్ ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేశారు. ఇద్దరు బాధితులు దిక్కు దోచని స్థితిలో వైసీపీ ప్రభుత్వంలో బాడుగ ఇండ్లలో తలదాచుకొని పరిస్థితి ఏర్పడింది. అయితే గత ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడం, కూ టమి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో వారిద్దరి బాధితుల మహిళలతో పాటు ప్రతి పేదవాడు సంతోషపడ్డారు. ఈ సంతోషంలో తన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు తలారి సునీత తన ఇంటి స్థలం వద్దకు వెళ్లారు. ఇల్లు కట్టుకునేందుకు పునాది తీశారు. అంతే ఇంకా ఆ మండల ఆర్ ఐ ఓ అంజి రంగంలోకి దిగి బాధితురాలు సునీతను ఇల్లు కట్టుకొనివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. దీనిపై బాధితురాలు సునీత సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులకు తన గోడును చెప్పుకున్న వినే పరిస్థితిలో ఎవరు లేకపోవడంతో తలారి సునీత రోడ్డున పడాల్సిందే దుస్థితి ఏర్పడింది. ఇక బాధితురాలు స్వర్గీయ తలారి మావి స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫారం మాత్రం విద్యుత్ అధికారులు తీసివేయడానికి సన్నద్ధం అయ్యారు. అయితే సునీత ఇల్లు కట్టుకునేందుకు మాత్రం రెవెన్యూ యంత్రాంగం సహకరించడం లేదు. ప్రధానంగా ములకలచెరువు మండలంలో పనిచేస్తున్న ఆర్ఐ అంజి పూర్తిగా సహకరించడం లేదని బాధితురాలు తలారి సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలను చూడకుండా బూతు పురాణం మాట్లాడుతూ ఆర్ ఐ అంజి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి ఆర్ఐ అంజి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ మూడు సెంట్లు స్థలంపై ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని టిడిపి నేతల కన్ను పడినట్లు సమాచారం. అయితే నిరుపేద మహిళలకు అండగా ఉండడంతోపాటు తన నియోజకవర్గంలో నిరుపేదల కు సొంతింటి కల నెరవేరుస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహా న్ భాష వారికి అండగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూడు సెంట్లు భూమి పై తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, అతని అనుచరులు, వైసిపి నేతల, కార్యకర్తల, చివరికి ఆ నియోజకవర్గ టిడిపి నేతల పంతం నెగ్గి ఆ మూడు సెంట్లు భూమి కబ్జాకు గురవుతుందా ? లేకుంటే పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ భాష పెద్దమనిషి మాట నెగ్గుతుందా అనేది… కొద్దిరోజుల్లో తేలనుంది.