contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చిత్రపురి అవినీతిపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

  • అలాట్మెంట్ లో లేని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ హైకోర్టు ఆర్డర్
  •  సుమారు వెయ్యి రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యే అవకాశం
  •  చిత్రపురిని బంగారు బాతులా వాడుకున్న అవినీతి కమిటీ!
  •  అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్న అధికారులు!

హైదరాబాద్ : చిత్రపురి కాలనీ అవినీతి పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆర్డర్ జారీ చేసింది. అలాట్మెంట్ లో లేని రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో సుమారు వెయ్యి రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యే అవకాశం ఉందంటున్నారు చిత్రపురి ఉద్యమకారులు. కోర్టు తీర్పు అక్రమార్కులకు, అవినీతి అధికారులకు చెంపపెట్టులాంటిదని చెబుతున్నారు.

హైకోర్టు(WRIT NO : 20552/22) గతంలో 3 నెలల్లో ట్రైబ్యునల్ స్టే వెకేట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది. కానీ, డీసీవో దానిపై చర్యలు తీసుకోలేదని అంటున్నారు. 2005-2020 మధ్య అన్ని అంశాలలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వంచే నియమించబడిన యాక్ట్- 51 నివేదిక, సెక్షన్ – 60 రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి మొత్తం కమిటీలోని 16 మందిని రద్దు చేయాల్సి ఉండగా.. అందులో ప్రస్తుత కమిటీలో ఉన్న ఐదుగురు 2021 జులై 31 నుంచి చిత్రపురి గవర్నింగ్ బాడీలో కొనసాగుతూ మరిన్ని అక్రమాలకు బరితెగించారు. దీనికి ప్రధాన కారణం రంగారెడ్డి జిల్లా డీసీవో శ్రీమతి ధాత్రీదేవి అని చెబుతున్నారు. డీసీవో యాక్ట్ – 51 ఎంక్వయిరీని అపహాస్యం చేస్తూ.. ట్రైబ్యునల్ లో స్టే తెచ్చుకొనేందుకు 21ఏఏ సెక్షన్ ని ఫ్రాడ్ కమిటీ సభ్యులు ఉపయోగించుకొనేందుకు పూర్తిగా సహకరించారని అంటున్నారు. ఐదుగురిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారో ఎవరికీ తెలియనివ్వకుండా సీక్రెట్ గా జారీ చేసి డీసీవో కూడా అక్రమాలలో భాగం అయ్యారని ఆరోపిస్తున్నారు.

21ఏఏ ప్రకారం వ్యక్తిగతంగా లబ్ది పొందలేదు అని ట్రైబ్యునల్ లో ఐదుగురు స్టే తెచ్చుకుంటే, మొత్తం 16 మంది వ్యక్తిగతంగా లబ్ది పొందారు అనేందుకు వందల సాక్ష్యాలు అందజేసినా ఆ స్టేని వెకేట్ చేయకుండా వారిని కాపాడుతున్నారు. ఇప్పటికీ.. మొత్తం చిత్రపురి అక్రమాలకు, ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలకు పూర్తిగా డీసీవో బాధ్యత వహించాల్సి ఉంటుందని.. తక్షణమే ఉన్నతాధికారులు ఆమెను డిస్మిస్ చేసి రంగారెడ్డి జిల్లాలోని సొసైటీలను రక్షించవల్సిందిగా ఉద్యమకారులు, సినీ కార్మికులు కోరుతున్నారు.

కోర్టులు అనేక ఆర్డర్స్ ఇచ్చినా వాటిని సీరియస్ గా తీసుకోకుండా అక్రమార్కులకు సహకరిస్తూ కాలయాపన చేశారని అంటున్నారు. ఆఫీషియల్ ఫైవ్ మెన్ కమిటీ అలాట్ మెంట్ లేకుండా చిత్రపురిలో ఇల్లు రిజిస్ట్రేషన్లు చేయకూడదు. కానీ, అడ్డగోలుగా చేశారు అని చెప్పి, ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుత కమిటీలోని కార్యదర్శి, కోశాధికారిలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ కమిటీ ప్రభుత్వ జీవోలను, చిత్రపురి బై లాస్ లను మరియు 1964 కో ఆపరేటివ్ యాక్ట్ లలోని నియమ నిబంధనలు అన్నీ కాలరాస్తోందని చెప్పారు. ఆఫీషియల్ ఫైవ్ మెన్ కమిటీ అలాట్ మెంట్ లేకుండానే అక్రమంగా ఇల్లు కేటాయించి, కొత్త సభ్యత్వాలు ఇస్తోందన్నారు. యాక్ట్ – 51 రిపోర్ట్ కి విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల వద్ద దాదాపుగా 18 కోట్ల రూపాయలు 24శాతం వడ్డీకి తీసుకొని తీవ్రమైన అక్రమాలకు పాల్పడింది కాబట్టి తమ కమిటీని రద్దు చేయమని అన్ని సాక్ష్యాలు సమర్పించారని చెబుతున్నారు. అయినా.. రంగారెడ్డి జిల్లా డీసీవో ఏమాత్రం చలనం లేకుండా ఎంక్వయిరీ కమిటీల పేరుతో కాలయాపన చేసి ఇంతవరకూ దానిపై స్పందించలేదని ఆరోపిస్తున్నారు.

కోర్టు ఆర్డర్స్ ప్రాసెస్ లో వున్నా కూడా అక్రమంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు ఆగలేదని చెబుతున్నారు. అంటే ఈ అవినీతి సామ్రాజ్యానికి రంగారెడ్డి జిల్లా డీసీవో పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్కరోజు కూడా ఆమె డీసీవోగా కొనసాగేందుకు అర్హురాలు కాదు కాబట్టి తక్షణమే డిస్మిస్ చేసి, చిత్రపురిని రక్షించాలని కోరుతున్నారు ఉద్యమకారులు, సినీ కార్మికులు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :