ఏపీలో అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు పోలీసులు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా , ఎన్ని సార్లు చెప్పినా సరే కొందరు అధికారుల తీరు మారడం లేదు. అధికార వైసిపి నేతలు ఏమి చేసినా చూసీచూడనట్టు వెళుతున్న అధికారులు , ప్రతిపక్ష నేతలు ఎం చేసినా సరే తప్పంటున్నారు. పల్నాడు జిల్లా కారంపుడిలో సిఐ మల్లయ్య టార్గెట్ టీడీపీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కారంపూడిలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న టిడిపి శ్రేణులను సిఐ మల్లయ్య బెదిరించారు. తుపాకీ చూపించి మరీ .. టిడిపి శ్రేణులను దుర్భాషలాడారు. తుపాకీ ఎందుకు తీశారు అని ప్రశ్నించిన టిడిపి శ్రేణుల పై ఎదురుదాడి చేసారు. చప్పిడి రాము అనే టిడిపి నేతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా . బిజెపి , టిడిపి , జనసేన నేతలు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో చప్పడి రాము ను వదిలిపెట్టారు పోలీసులు. పోలీసుల తీరుపై మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.