మాచర్ల : మాచర్ల రూరల్ సిఐ గా కె. సురేష్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఒంగోలు జిల్లాలోని పలు మండలాలలో ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రమోషన్ పై ఇక్కడకు వచ్చారు. మాచర్ల రూరల్ సిఐగా ఇప్పటివరకు విధులు నిర్వహించిన షేక్ సమీముల్లా బదిలీపై ప్రకాశం జిల్లా దర్శి వెళ్లినట్లు సమాచారం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సురేష్ మాట్లాడుతూ తన పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పరిధిలోని ఆయా మండలాలపై దృష్టి సారించినట్టు ఆయన పేర్కొన్నారు.
