చిత్తూరు జిల్లా: గంగవరం మండలంలో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ ప్రసాద్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
సీఐ ప్రసాద్ మాట్లాడుతూ, దూర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో మరియు ఒంటరి ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదా సెన్సార్ లాక్స్ అమర్చడం, అలాగే పోలీసులకు తెలియజేయడం అత్యంత అవసరమని తెలిపారు. ఇది క్రైం నివారణకు ఎంతో సహాయపడుతుంది అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో, బతుకమ్మ చిలక పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేసవి సెలవుల సమయంలో పిల్లలు చెరువులు, బావులు వంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. ఈతరాని పిల్లలను అలాంటి ప్రదేశాలకు పంపడం వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగవచ్చని ఆయన తెలిపారు.
వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజల భద్రత కోసం ప్రణాళికలు అమలు చేస్తున్నారని, ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని సీఐ ప్రసాద్ తెలిపారు.