contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో.. మాల్‌ ప్రాక్టీస్‌కు యత్నించిన కారంపూడి సిఐ కుమారుడు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (మార్చి 17) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కు1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది మాత్రమే హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో రెండు పేపర్ల పరీక్షకు 91,463 మంది అంటే 72.55 శాతం మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరైనట్లు కమిషన్‌ తెలిపింది. ఇదిలా ఉండగా..

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (మార్చి 17) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కు1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,26,068 మంది మాత్రమే హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో రెండు పేపర్ల పరీక్షకు 91,463 మంది అంటే 72.55 శాతం మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరైనట్లు కమిషన్‌ తెలిపింది. ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో గ్రూప్‌ 1 పరీక్షలో కాపీయింగ్‌కు ప్రయత్నించి ఓ అభ్యర్ధి సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. పట్టుబడిన అభ్యర్ధి ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య కుమారుడిగా గుర్తించారు.

తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శివశంకర్‌ ఆదివారం నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్ష రాసేందుకు ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ కేంద్రానికి చేరుకున్నాడు. అధికారుల కళ్లుగప్పి పరీక్ష కేంద్రంలోకి తెచ్చుకున్న ఐ ఫోన్‌తో ప్రశ్నాపత్రాన్ని స్కాన్‌ చేసి, బయటకు పంపడాన్ని తోటి అభ్యర్ధులు గుర్తించారు. అదే గదిలో పరీక్ష రాసున్న ఎస్సై అధికారులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న జాయెంట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ నిందితుడు శివశంకర్‌ను పోలీసులకు అప్పగించి, అతడి నుంచి ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు శివశంకర్‌ను ఎంత ప్రశ్నించినా పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ఐటీ కోర్‌ బృందాన్ని రప్పించి ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు యత్నించి విఫలమయ్యారు.

మాల్‌ ప్రాక్టీస్‌ కింద శివశంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీలు చేసినా ఫోన్‌తో అతను లోపలికి ఎలా ప్రవేశించాడనే దానిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఉదయం 11.30 గంటల సమయంలోనే ఈ విషయం బయటకు వస్తే నిందితుడి నుంచి ఎటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారు. క్వశ్చన్‌ పేపర్ ఎవరెవరికి, ఎక్కడెక్కడికి పంపించాడనే విషయం విచారణలో తెలాల్సి ఉంది. ఒంగోలు పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :