అల్లూరి జిల్లా,చింతపల్లి: హాస్పిటల్ లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె, నిరసనలు జరుగుతూనే వుంటాయని చింతపల్లి మండలం సిఐటీయు సెక్రటరీ వి. రామకృష్ణ అన్నారు. ఈ సందర్బంగా సిఐటియు మండల సెక్రెటరీ వి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ మరియు పారిశుధ్య కార్మికులు నిత్యం ప్రాణాలు తెగించి ప్రతిరోజు ఎంతోమంది ప్రజలకు వారి సేవలను అందిస్తున్నారు. అలాంటి కార్మికులపై యజమాన్యం పని ఒత్తిడి పెంచి పారిశుధ్య మరియు సెక్యూరిటీ గార్ల పట్ల అది పత్యం చెలాయిస్తున్నారు. అలాగే పనికి తగ్గ వేతనం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు నెలకి 16 వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి కార్మికులకు న్యాయం చేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని,అలాగే పి ఎఫ్, ఈ ఎస్ ఐ అమలు చేయాలి వేతనాలతో కూడిన సెలవులు మంజూరు చేయాలి సానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి పని భారం తగ్గించాలి న్యాయమైన కోరికలు యాజమాన్యం వారు తీర్చేంతవరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ప్రాంతీయ వైద్యాలయం కార్మికులు,సెక్యూరిటీ గార్డ్ బుజ్జి బాబు,సాయి కుమార్,చిన్నబ్బాయి, పరిశుద్ధ కార్మికులు రామారావు,మంగ వేణి,సింహాచలం, గున్నమ్మ తదితరులు పాల్గొన్నారు