అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. పట్టణంలోని గాంధీ కూడలిలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి వి.నిర్మల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు బి.రామకృష్ణ, ఐద్వా మండల అధ్యక్షురాలు ఆర్ఎం. కవిత, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్థానిక అధ్యక్షుడు కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు మహేష్, సహాయ కార్యదర్శి సుంకన్న, నాయకుడు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
