contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అటవీ కార్మికుల గురించి టిటిడి బోర్డు పట్టించుకోకపోవడం శోచనీయం: సిఐటియు నేత కందారపు మురళి

తిరుపతి: 900 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికుల గురించి టీటీడీ పాలకమండలి సమావేశంలో బోర్డు సభ్యులు చర్తించక పోవడం శోచనీయమనీ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో ఆవేధన వ్యక్తం చేశారు. ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం ప్రచారం చేసే తిరుమల తిరుపతి దేవస్థానం.., పేద అటవీ కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనలను పాటించకుండా, తాను చేసిన తీర్మానాన్ని సైతం బోర్డు అమలు చేయకుండా, 362 మంది కార్మికుల్లో 162 మందిని పర్మినెంట్ చేసి, 200 మందిని వీధుల పాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వివక్షకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవదేవుని ఎదుటే యాజమాన్యం పేద కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన నిలదీశారు. టిటిడి యాజమాన్యం అటవీ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :