రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు టీటీడీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, సొసైటీలలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 2014 జూలై రెండవ తేదీని కట్ ఆఫ్ ఇయర్ గా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం చేసిందని, వాస్తవంగా టీటీడీలో పాతిక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సొసైటీ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్టు, ఎఫ్ ఎం ఎస్ లలో పనిచేస్తున్న కార్మికులను టిటిడి యాజమాన్యం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టీటీడీలోని కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆయన ఆ ప్రకటనలో టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. రానున్న బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చించి కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కటాఫ్ ఇయర్ తేదీని మార్చాలని 2014 సంవత్సరం ప్రాతిపదిక కాకుండా డిసెంబర్ 2022వ సంవత్సరం ను ప్రాతిపదిక గా తీసుకొని ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు టీటీడీ లాంటి సెమీ ప్రభుత్వ సంస్థలలో వందల నుంచి వేలాది మంది కార్మికులు ఉన్నారని, స్విమ్స్ ఆసుపత్రిలో 800 నుంచి 2000 మంది వరకు కార్మికులు ఉన్నారని ఇతర ప్రభుత్వ విభాగాలు స్థానిక సంస్థలు ఇతర రంగాలన్నింటిలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న నేపథ్యంలో కేవలం పదివేల మందికి వర్తించే నిర్ణయం కాకుండా, అన్ని విభాగాల్లో 2022 వ సంవత్సరం డిసెంబర్ నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ ని పూర్తి చేసుకున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టీటీడీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.