లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హజరవుతారు. 20వ తేదీ సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొంటారు.
21న భువనగిరిలో చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. 22 ఉదయం ఆదిలాబాద్ సభ, 23న నాగర్ కర్నూల్ లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 24 ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు కేరళ పర్యటనలో వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి మద్దతుగా రేవంత్ ప్రచారాన్ని నిర్వహించారు. కాబోయే ప్రధాని రాహుల్ అని రేవంత్ జోస్యం చెప్పారు.