తెలంగాణలో ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
