తెలంగాణలో పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే నిబంధన అందరినీ గందరగోళానికి గురి చేసింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని తెలిపారు. ఈ నెల 18లోపు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.