హైదరాబాద్ : నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ బహిష్కరించారు. కేంద్రబడ్జెట్లో ప్రతిపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ.. అందుకు నిరసనగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
సమావేశాన్ని బహిష్కరించిన వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్. అలాగే ఇండియా కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్ (తమిళనాడు), పినరాయి విజయన్ (కేరళ), భగవంత్ మాన్(పంజాబ్) బహిష్కరించారు.