హైదరాబాద్ : పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 వరకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పమని అన్నారు. ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1,50,000 రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఉబిలా నుంచి బయటకు తెచ్చామని అన్నారు. ఈరోజు మూడో విడత రుణమాఫీ చేయబోతున్నామని చెప్పారు. ఈరోజు రూ.1,50,000 నుండి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు.