తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ , ఆయన సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన దగ్గుబాటి సోదరులు ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ కు పుష్పగుచ్ఛాన్ని అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ తో కాసేపు వారు ముచ్చటించారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
