మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… నళిని పేరును ప్రస్తావించారు.
పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధాత్మిక చింతనతో ఉన్నానని.. తాను ఫిట్ కూడా కాదని.. అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ డిఎస్పీ నళిని విషయంలో స్పందించిన సియం రేవంత్ రెడ్డి గారికి కి కృతజ్ఞతలు : వి.సుధాకర్