contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Prakasam: చీమకుర్తిలో .. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా / చీమకుర్తి :  చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు.

వసతి గృహం ప్రాంగణంలోఅదనపు గదుల నిర్మాణానికి రెండు కోట్ల డి.ఎం.ఎఫ్ నిధులను మంజూరు చేసినట్లు తెలియజేశారు.

ప్రస్తుతం హాస్టల్లో రెండు వందల పదమూడు మంది బాలికలు ఉండగా బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల చేరువులో ఉండటంతో ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అదనపు గదుల నిర్మాణానికి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

హాస్టల్లో అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు, విద్యాభ్యాసం మరింత శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మ నాయక్, ఏ ఎస్ డబ్ల్యూ ఓ దానయ్య, వార్డెన్ అరుణ తదితరులు ఉన్నారు.

చీమకుర్తిలో దెబ్బతిన్న కారుమంచి మేజర్ కాలువను పరిశీలించారు. సుమారు 16 వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాలువ గూర్చి రైతులను అడిగి తెలుసుకున్నారు. కాలువ మార్గాన్ని మళ్ళించడం ద్వారా కేవలం తాగునీరు మాత్రమే అందుతుందని , కాలువను పునరుద్ధరించి 16 వేల ఎకరాలకు నీరు అందించే ఈ కాలువ ద్వారా 136 క్యూసెక్కుల నీళ్లు అందేలా2.62 కోట్లతో పునర్నిర్మానానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని నీటిపారుదల శాఖఅధికారులకు ఆదేశించారు.

చీమకుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి, వార్డులను పరిశీలించారు. రోగులతో ప్రత్యేకంగా మాట్లాడి వైద్య సేవలను అందిస్తున్న తీరును, వైద్యుల ప్రవర్తన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం గారికి కావలసిన స్థలాన్ని పరిశీలించి, సంబంధిత ప్రతిపాదనలను వైద్యులతో అధికారులతో కలెక్టర్ చర్చించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :