ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గం చీమకుర్తి పట్టణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను గూర్చి తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం, అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణం , పెన్షన్ల పంపిణీ తదితర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అందిస్తుందో తెలియజేశారు.
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందిమల్ల గంగారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని, చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలను ఇప్పుడున్న వైసీపీ కౌన్సిలర్లు పట్టించుకోవడంలేదని, గడచిన మూడున్నర సంవత్సరం కాలయాపన చేశారని సమస్యలపై గాని ,అభివృద్ధిపై గాని చిత్తశుద్ధి లేదని, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి , తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని , చీమకుర్తి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చీమకుర్తి మున్సిపల్ మేనేజర్ పోతురాజు, అడకస్వాములు,చీమకుర్తి పట్టణ తెలుగుదేశం నాయకులు గొల్లపూడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, రావి పాటి రాంబాబు, కందిమల్ల గంగారావు, సూరంపల్లి హనుమంతరావు, మన్నం ప్రసాదు, జనసేన పార్టీ నాయకులు, తాతినేని శ్రీరామ్, దరిమడుగు నాగరాజు, ముత్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.