ప్రకాశం జిల్లా చీమకుర్తి అంబేద్కర్ నగర్ కు చెందిన బత్తుల రవి కుమార్తె బత్తుల నిత్యశ్రీ కు కర్నూల్ విశ్వభారతి మెడికల్ కాలేజి లో ఎంబిబిఎస్ ఫ్రీ సీట్ సాధించింది. మెడికల్ విద్యార్థి విద్యావసరాలకు గాను ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బూ చేపల్లి వెంకాయమ్మ 50,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఉచిత సీటును సాధించినందుకు గాను నిత్యశ్రీ ని అభినందించి, విద్యలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూచేపల్లి కుటుంబం పేద విద్యార్థులకు అండగా ఉంటుందని , తమవంతు సాయం ఉంటుందని తెలియజేశారు.