ప్రకాశం జిల్లా చీమకుర్తి లో పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు పాఠాలలకు సంబంధించిన విద్యార్థులు , చీమకుర్తి పోలిస్ స్టేషన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలిస్ అమర వీరుల త్యాగాలను, వారు డిపార్ట్మెంట్ కి చేసిన సేవలను గురించి వివరించారు. విధి నిర్వహణ లో ప్రాణాలు వదిలిన పోలీస్ వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు,ఎస్ఐ వి.కృష్ణయ్య, స్టేషన్ సిబ్బంది,పలు విద్య సంస్ధ ల సిబ్బంది పాల్గొన్నారు.
