చీమకుర్తి: చీమకుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసారు . ఎక్కడైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో, అందులో కోడిపందాలు, పేకాట, వ్యభిచారం, గంజాయి త్రాగడం, అమ్మడం, రవాణా చేయడం, లేదా గ్రానైట్ అక్రమ రవాణా వంటి చర్యలు జరగితే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఆల్కహాల్ త్రాగి వాహనాలు నడుపుతున్న వ్యక్తులు ప్రమాదాలను కలిగి వస్తున్నారని CI తెలిపారు. త్రాగి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. షాపుల మరియు వాణిజ్య సముదాయాలలో CC కెమెరాలను అమర్చాల్సిందిగా CI విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా సూచించారు.
దీపావళి పండుగ సందర్భంగా, తాత్కాలిక లైసెన్స్ లు పొందినవారు, పండుగ తర్వాత మిగిలిన టపాసుల ను స్టాక్ ను లైసెన్స్ గోదాం లో తిరిగి అప్పచెప్పవలెను. లేకపోతే, వారి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.