తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన బాధ్యతను అందెశ్రీకి అప్పగించినట్లు చెప్పారు. ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుందన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందన్నారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని… ఎలాంటి సమస్యలు లేవన్నారు. విద్యుత్ వినియోగం పెరిగినా లోటు లేకుండా ఇస్తున్నట్లు చెప్పారు.