శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం జగన్నాధపురం గ్రామానికి వెళ్లే ప్రధానరహదారి పై ఉన్న వంతెన కూలడంతో గ్రామస్తులు, వాహన దారులు ఇబ్బందులకు గురవుతున్నరు. గతంలో వంతెన ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు అధికారులులకు తెలిపినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. ఇకనయినా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
