- గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
- రూ.12 కోట్ల 25 లక్షల బిల్లులు లబ్దిదారుల ఖాతాలకు జమ
- మే, జూన్ నెలలకు 5 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
అల్లూరి జిల్లా, పాడేరు: గృహ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమ వారం కలెక్టర్ కార్యాలయపు మినీ సమావేశ మందిరంలో పాడేరు, రంపచోడవంద, చింతూరు డివిజన్ల పరిధిలోని గృ హ నిర్మాణశాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లాలో జరుగుతున్న గృహనిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గృహ నిర్మాణాలకు చిల్లులు జమ చేస్తోందన్నారు. జిల్లాలో వివిధ దశలలో నిర్మాణం జరిగిన గృహాలకు రూ. 12 కోట్ల 25 బిల్లును ప్రభుత్వం గత వారం జమ వేసిందని పేర్కొన్నారు. మరో రూ.35 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులతో సమావేశాలు పెట్టి గృహ నిర్మాణాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. నవివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లక్ష్యాలు నిర్దేశించి ఏకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లాకు 17,149 ఇళ్లు మంజూరయ్యాయని 15,105 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మాణాలు ప్రారంభించారని చెప్పారు. వెలుగు ఎంపిలతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు అధికారులతో మాట్లాడి ఎస్ హెచ్ జి నుండి రూ.35 వేలు రుణాలు అందించి గృహ నిర్మాణాలకు ఆర్ధిక తోడ్పాటు అందించాలని అన్నారు. ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించక పోవడంపై ఆరా తీసారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు బిల్లులు వెల్లిస్తోందని లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశం గృహ నిర్మాణశాఖ ఇన్చార్జి పిడి బి. బాలు, రంపచోడవరం ఇ ఇనాగేశ్వరరావు, డి ఇవ్వర సింహరావు, అరకు వ్యాలీ డి ఇ మోహన రావు, ఎటపాక డి ఇ మూర్తి, 22 మండలాల ఎ. ఇలు తదితరులు పాల్గొన్నారు.