రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్దికంగా నష్టపరిహారం ఇవ్వాలని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు గోర్లే సునీత, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షుడు కారం సురేష్ బాబులు డిమాండ్ చేశారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అకాల వర్షలకు వరి పంట దెబ్బతిందని అయా రైతులకు నష్టరిహారం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వరరావు కు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు చంద్ర బాబు నాయుడు,రాష్ట్రంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల కోసం పాటుపడుతూ ,జగన్ ప్రభుత్వం పనితీరును ఎండగడు ఉన్నారని, రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ఆర్దికంగా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తూ నామని అన్నారు. ఇప్పటికీ పొలాల లోనే తడిసిన ధాన్యం కుప్పలుగా ఉన్నాయని ,వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆమె అన్నారు.
ఈ సమావేశం లో ప్రధాన కార్యదర్శి అనంత మోహన్ ,అరకు బీసీ సెల్ నాయకులు దిడ్డి జనార్ధన్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బొడ్డేటి వీరబాబు, సాధల సత్య, చక్రపాణి రామన్న దొర, బాబ్జి తదితరులు పాల్గొన్నారు