సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలంలోని రేగులపల్లి,బేగంపేట్, బెజ్జంకి మండల కేంద్రంలోని టి- సెర్ఫ్ అధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం🌾 కొనుగోలు కేంద్రాలు నేటితో పూర్తీ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో *బెజ్జంకి మండల వ్యాప్తంగా రేగుల పల్లి సెంటర్ లో 18 వేల క్వింటాళ్ల తో మొదటి స్థానం, బెజ్జంకి సెంటర్ లో 15 వేల క్వింటాళ్ల తో రెండవ 11వేలక్వింటాళ్లతో, బేగంపేట3వ స్థానంలో నిలిచాయనీ, ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులను, హమాలిలను,సహకరించిన స్థానిక ప్రజా ప్రతినిదులును శాలువాతో సన్మానించారు.
కొనుగోళ్ళు పూర్తీ కావటంతో సెంటర్లను మూసి వేయటం జరిగినదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో *”బీఅర్ఎస్ సీనియర్ నాయకులు కనగండ్ల తిరుపతి, బీఅర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సర్పంచ్ జెల్ల అయిలయ్య యాదవ్ , చింతలపల్లి సంజీవరెడ్డి ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి, బేగంపేట ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి మాజీ AMC చైర్మన్ కచ్చు రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజ్జంకి శంకర్ ఉప సర్పంచ్ కొట్టే సంతోష్ రెడ్డి, సీసీ పొత్తూరి సారయ్య, తిరుపతి, వివో ఎ లు నాగవ్వ, బెజ్జంకి వీణ, బుర్ర అంజలి, వివో అధ్యక్షురాలు పబ్బతి సంధ్య తదితరులు పాల్గొన్నారు.