మదనపల్లి జులై 19:విద్యార్థి దశలోనే నాయకత్వం లక్షణాలు కలిగిన నిగర్వి, సేవాదార్శినికుడు, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. శుక్రవారం రెడ్డీ సాహెబ్ పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి రెడ్డీ సాహెబ్ అభిమానులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు పూలమాలలు వేసి దుశ్శాలువులతో సన్మానించి, పూల బోకేలు అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ ఏర్పాటు చేసి రెడ్డీ సాహెబ్ చేతుల మీదుగా కట్ చేయించి పంచిపెట్టారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ప్రజా సేవ కోసం పరితపించే రెడ్డీ సాహెబ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికి రెడ్డీ సాహెబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్.కే.బాష, మహబూబ్ పీర్, మహమ్మద్, మీనా కుమారి, ఈశ్వరమ్మ, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.