హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దానం వ్యవహరశైలిపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఆక్రమణలు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రాపై దానం చేసిన కామెంట్లపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా చేయడం ఏంటని సీఎం దానం నాగేందర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. రేవంత్ క్లాస్ తీసుకోవడంతో దానం నాగేందర్ వెనక్కి తగ్గారు. హైడ్రా మంచిపని చేస్తుందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయినా.. సీఎంకు దానంపై కోపం చల్లారలేదన్న టాక్ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.