సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో గత మూడు రోజుల నుండి ఇండ్లు లేని నిరుపేదలు చేస్తున్న న్యాయపోరాటానికి బుధవారం మద్దతు ప్రకటిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 2018లో బేగంపేట గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదల కోసం కేటాయించినటువంటి భూమిని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వడ్ల కొనుగోలు కేంద్రానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని గతంలో ఇండ్ల నిర్మాణం కోసం అంచనా విలువను కూడా శిలాఫలకంపై ఆవిష్కరించడం జరిగిందని ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రంకు ఆ స్థలాన్ని కేటాయించడం సరైన నిర్ణయం కాదని, వడ్ల కొనుగోలు కేంద్రానికి పక్కనే ఉన్న 10 గుంటల భూమిని కేటాయించి, శిలాఫలకం ఆవిష్కరించిన స్థలంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేనిపక్షంలో ఆరు నెలలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఈ స్థలంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తూ, గ్రామములో ఇండ్లు లేనటువంటి ఇంకా మిగిలినటువంటి నిరుపేదలు గుడిసెలు వేసుకోవాలని ప్రోత్సహించారు. ఎవరు అడ్డం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆశావాహులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బేగంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమ రామ్ రెడ్డి, తుమోజు వెంకటాచారి, శీలం నరసయ్య, మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్, మేకల( కొరిమి ) కనకయ్య, రాజు మహేందర్,బర్ల బాబు, పిట్టల అరుణ్ దితరులు పాల్గొన్నారు.