కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెందిన తిప్పర్తి పరిపూర్ణ చారి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు మానకొండూరు నియోజవర్గ ఇన్చార్జి డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిప్పర్తి పరిపూర్ణ చారి బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కలిశారు. వీరి వెంట జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,తదితరులు ఉన్నారు. తనపై నమ్మకంతో పార్టీ నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు తిప్పర్తి పరిపూర్ణ చారి కృతజ్ఞతలు తెలిపారు